కాంగ్రెస్, టీడీపీలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు: మోదీ

  • మోదీ మెగా   వీడియో కాన్ఫరెన్స్
  • పాల్గొన్న కోటిమంది బీజేపీ కార్యకర్తలు
  • కాంగ్రెస్, టీడీపీపై మండిపాటు
‘మేరా బూత్ సబ్‌సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ గురువారం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలోని 15 వేల ప్రాంతాల నుంచి కోటిమందికిపైగా కార్యకర్తలు ఈ మెగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీని విభజించిన కాంగ్రెస్‌పైనా, ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేసిన తెలుగుదేశం పార్టీపైనా రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని  అన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని మోదీ జోస్యం చెప్పారు. తమిళనాడు చరిత్రలోనే తమ కూటమికి అతిపెద్ద విజయం దక్కబోతోందన్న మోదీ.. కేరళ ప్రభుత్వంపైనా ప్రజలు విసిగిపోయారన్నారు.

దక్షిణాదిలో బీజేపీకి ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు.  తప్పుడు వార్తలను ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు ఆరితేరిపోయాయని, అదే వాటి అజెండా అని మోదీ విమర్శించారు.
Go Back to Shorts
Narendra Modi
Chandrababu
Telugudesam
Congress
BJP
Video conference

More Telugu News